YSRCP: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన వారు ఎంతో మంది రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇకపోతే 2019 ఏపీ ఎన్నికల సమయంలో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు కీలక నటీనటులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు.
ఇలా గత ప్రభుత్వ హయామంలో పార్టీ కోసం కష్టపడిన వారికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక పదవులను కూడా ఇచ్చారు.. అయితే ఈ పదవులలో ఉన్నటువంటి సినీ సెలబ్రిటీలు అప్పట్లో ప్రతిపక్ష నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. అయితే ఊహించని విధంగా 2024వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ విధంగా కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో సోషల్ మీడియాలో వారి గురించి అనుచిత పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఎంతో మందిని అరెస్టులు చేయగా పలువురు ఈ అరెస్టులకు భయపడి ఏకంగా వైఎస్ఆర్సిపి పార్టీకే గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా వైఎస్ఆర్సిపీ పార్టీకి మద్దతు తెలిపినటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీలు అయినా రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి ఆలీ పోసాని కృష్ణమురళి వంటి వారందరూ కూడా తమ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఒక్కొక్కరిగా ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ తాము ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నామని తెలియజేశారు. ఏ రాజకీయ పార్టీలతో కూడా మాకు సంబంధం లేదని ప్రకటించారు.
ఇలా ఒక్కొక్కరుగా పార్టీకి శాశ్వతంగా దూరం అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సినీ గ్లామర్ పూర్తిగా దూరం అయ్యారనే చెప్పాలి. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కనుక పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే తిరిగి వీరంతా రాజకీయాలలోకి వస్తారా లేకపోతే తమ సీని కెరియర్ ను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.