అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాలో కంటెంట్ సరిగ్గా లేదనే నెగెటివ్ టాక్ సంగతి తర్వాత, ముందైతే సినిమా రిలీజ్ అవక మునుపే ఎందుకు విపరీతమైన నెగెటివిటీ వచ్చిందన్నదే ప్రశ్న ఇక్కడ.
నందమూరి అభిమానులు పనిగట్టుకుని నిన్న సాయంత్రం నుంచే ‘ఏజెంట్’ సినిమాని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. పాత పగల్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ శ్రేణులు, అక్కినేని అఖిల్‌ని టార్గెట్ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
‘ఎవరూ ఈ సినిమా చూడొద్దు..’ అంటూ టీడీపీ మద్దతుదారులు, ‘ఏజెంట్’ సినిమా విషయమై తమ వర్గం ప్రేక్షకుల్ని అలర్ట్ చేయడం కనిపించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సందేశాలు వెళ్ళాయి. మరోపక్క ఓవర్సీస్లో కూడా ‘ఏజెంట్’ విషయమై ముందే నెగెటివిటీని ప్రచారం చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాగార్జున అత్యంత సన్నిహితుడు కావడంతో అది దృష్టిలోపెట్టుకుని నాగార్జున కొడుకు అఖిల్ సినిమాని టీడీపీ చంపేయాలని చూసింది, చంపేసింది కూడా.
మరోపక్క, బాలకృష్ణ ఇటీవల ‘అక్కినేని తొక్కినేని..’ అని వ్యాఖ్యానించడం, తదనంతర పరిణామాల్లో భాగంగా అఖిల్, నాగచైతన్య ఆ కామెంట్లను ఖండించడంతో.. నందమూరి అభిమానులు, అక్కినేని కుటుంబ హీరోలపై కక్ష పెంచుకున్నారు. వెరసి, ‘ఏజెంట్’ ఫ్లాప్ విషయంలో రాజకీయమే కీలక పాత్ర పోషించినట్లు చెప్పొచ్చేమో.!