‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే తాజాగా. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వచ్చిన సినిమా ఇది.
ప్రమోషన్ చిత్రాలు బాగున్నాయ్. అంతకు మించి సినిమా గురించి పెద్దగా అతి చేసింది లేదు. ముఖ్యంగా ఈ సినిమాని అనుష్క అస్సలు ప్రమోట్ చేసింది లేదు.
ఎక్కడా సినిమా ప్రమోషన్లలో అనుష్క కనిపించింది లేదు. లాస్ట్‌లో కొన్ని ఫోన్ ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చింది. అవి కూడా పెద్దగా పాపులర్ కాలేదు.
నిజానికి సినిమా ప్రమోషన్లు అంటే అనుష్క చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుంటుంది. కానీ, ఈ సినిమా విషయంలో అనుష్క ఒకింత డైలమాలో వుందట.
సినిమా విడుదలయ్యాకా.. ఓకే గుడ్ బాగానే వుంది.. అన్న టాక్ వచ్చాకే అనుష్క ఊపిరి పీల్చుకుందట. సాగతీత అన్న టాక్ అయితే నడుస్తోంది కానీ, ఓవరాల్‌గా అనుష్క హ్యాపీ అని తెలుస్తోంది.
దాంతో, ఇక నుంచి డైరెక్ట్ ఇంటర్వ్యూలకు అనుష్క సిధ్దమవుతోందట. నిజానికి ఈ సినిమాని అనుష్క లైట్ తీసుకోవడమే కలిసొచ్చిందేమో. అనుష్క ప్రమోషన్లకు వస్తే, సినిమాపై అంచనాలు పెరిగిపోయేవి. అంత హైప్ క్రియేట్ అయ్యాకా, రిలీజ్ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ లేకుంటే.. ఖచ్చితంగా వుండి వుండేది కాదు.
లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడమే ఈ సినిమా విజయానికి కలిసొచ్చింది.. అన్న టాక్ వినిపిస్తోంది. అయితే, అనుష్క అనారోగ్య కారణాలు కూడా ప్రమోషన్లకు హాజరు కాకపోవడానికి ఓ కారణం అని అంటున్నారు కొంతమంది.