Kiara Advani: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. విడుదల తేదీకి మరొక ఆరు రోజులు మాత్రమే సమయము ఉండడంతో ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు. కొత్తగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు మూవీ మేకర్స్ దాదాపుగా అందరూ పాల్గొంటున్నారు. శంకర్, రామ్ చరణ్ తో పాటు SJ సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి స్టార్స్ అంతా హాజరవుతున్నారు. కానీ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ మాత్రం ప్రమోషన్స్లో ఎక్కడా కనిపించడం లేదు. ఒక్క టీజర్ లాంచ్ ఈవెంట్లో తప్ప ఇప్పటివరకు ఎక్కడా ప్రమోషన్స్ లో కనపడలేదు. అయితే నేడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.
ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ కి కూడా కియారా హాజరవకపోవడంతో ఈ విషయం మరింత చర్చగా మారింది. కానీ బాలీవుడ్ లో కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం చరణ్ తో పాటు ఇచ్చింది కియారా అద్వానీ. అయితే ఇంత పెద్ద సినిమాకు కియారా ఎందుకు ప్రమోషన్స్ కి రావట్లేదు అని అంతా చర్చించుకుంటున్నారు. కియారాని ప్రమోషన్స్ కి తీసుకురమ్మని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో మూవీ యూనిట్ ని అడుగుతున్నారు. అయితే కొన్ని బాలీవుడ్ మీడియాలు కియారా హాస్పిటల్ లో ఉందని, ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది రాసుకొచ్చారు. అందువల్లే ఆమెను ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు అంటూ వార్తలు వినిపించడంతో.. దీనిపై కియారా మేనేజర్ స్పందిస్తూ.. కియారా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వలేదు. తను విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల కొద్దిగా విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినట్టు తెలిపారు. అందుకే ఇవాళ ముంబై ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందీ.