Anaganaga Oka Raju: న‌వీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు టీజర్ రిలీజ్.. వీడియో వైరల్!

Anaganaga Oka Raju: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు నవీన్ పొలిశెట్టి. అందులో భాగంగానే చివరగా గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి ఎలాంటి సినిమాలో నటిస్తాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే తాజాగా అభిమానులకు ఒకసారిగా ఊహించని షాక్ ఇస్తూ గతంలో నిలిచిపోయిన అనగనగా ఒక రాజు సినిమాను మళ్ళీ మొదలుపెట్టారు.

ఇదే విషయాన్ని తెలుపుతూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇతర ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. అప్పుడెప్పుడో రెండు ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు తాజాగా మళ్ళీ మొదలైంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ అనగనగా ఒక రాజు సినిమా నుంచి ఒక టీజర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ రిలీజ్ చేసిన దీని నిడివి మూడు నిమిషాల 2 సెక‌న్లు. ఇక టీజ‌ర్‌ లో న‌వీన్ పొలిశెట్టి త‌న‌దైన కామెడీతో అల‌రించారు. ఇందులో నవీన్ పొలిశెట్టికు ముకేశ్ అంబానీ ఫోన్ చేసిన‌ట్లుగా చూపించారు.

Anaganaga Oka Raju - Pre Wedding Video | Naveen Polishetty, Meenakshi Chaudhary | S Naga Vamsi

ముకేశ్ మామ‌య్య‌.. నీకు వంద రిచార్జులు అంటూ న‌వీన్ చెప్పిన డైలాగ్ న‌వ్వు లు పూయిస్తోంది. మొత్తంగా చుస్తే టీజ‌ర్ అదిరిపోయింది. ఈ సినిమాతో నవీన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం పక్కా అని తెలుస్తోంది. గతంలో అనిలిచిపోయిన ఈ సినిమాను మళ్ళీ మొదలుపెట్టడంతో అభిమానులు ఒకవైపు ఆందోళన చెందుతూనే మరోవైపు సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. అయితే ఇటీవల చిన్న యాక్సిడెంట్లో గాయపడిన నవీన్ పొలిశెట్టి చాలా రోజులపాటు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూర్తిగా కోరుకున్న నవీన్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో నటిస్తున్నారు.