Thandel Song: టాలీవుడ్ హీరో సాయి పల్లవి, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం తండేల్. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు ఈ సినిమాఫై అంచనాలను భారీగా పెంచేసాయి. ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, బుజ్జి తల్లి సాంగ్ లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుతూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేస్తూనే ఉన్నారు మూవీ మేకర్స్.
అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు. నమో నమో నమః శివాయ అంటూ సాగే ఈ శివ భక్తి పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. తాజాగా విడుదల చేసిన ఈ పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పాటను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో తెలుగులో అనురాగ్ కులకర్ణి, హరిప్రియ అద్భుతంగా పాడారు. ఈ పాటకు నాగచైతన్య అలాగే సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ పాటను చూసిన ప్రతి ఒక్కరు సాయి పల్లవి చైతన్య డాన్సులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే తండేల్ సినిమా శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారులకు చెందిన రియల్ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సముద్రంలో వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి ప్రభుత్వానికి చిక్కితే అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అని ఎమోషనల్ దేశభక్తి కంటెంట్ తో ఈ సినిమా రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ తో బిజీగా ఉంది ఈ సినిమా.