Sankranthiki Vasthunnam: ఏంటి.. వెంకీ మామ సినిమా అంత తక్కువ టైమ్ లో పూర్తయిందా.. ఐదు నిమిషాలే వృధా అంటూ!

Sankranthiki Vasthunnam: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుత ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త విన్న అభిమానులు అవునా అంటూ షాక్ అవుతున్నారు. అదేమిటంటే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సాధారణంగా స్టార్‌ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. రాజమౌళి లాంటి వాళ్లు అయితే మూడు ఏళ్లకు పైనే సమయం తీసుకుంటారు. కానీ అనిల్‌ రావిపూడి మాత్ర కేలవం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు.

అది కూడా స్టార్‌ హీరో సినిమా. అదే సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్‌ మాత్రమే వృథా అయిందట. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అనౌన్స్‌ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని భావించాము. తక్కువ సమయం షూటింగ్‌ ముగించుకోవాలనుకున్నాము. స్క్రిప్ట్‌ సమయంలోనే ఎడిటింగ్‌ చేసేశాము. ఫలానా సీన్‌ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాము. అందుకే 72 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే 2.22 గంటల నిడివితో సెన్సార్‌ కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్‌ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్‌ అవసరమో అంతకు ఏ మాత్రం తగ్గకుండా తీశాము. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు అని అనిల్‌ రావిపూడి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్త విన్న వెంకీ మామ అభిమానులు అవునా అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం.