Allu Arjun: సంధ్య థియేటర్ ఇష్యూ… అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు… ఏం జరిగిందంటే?

Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటనలు అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే .ఒకరోజు మొత్తం ఈయనని జైలులో ఉంచిన తర్వాత మధ్యంతర బేయిలు మీద అల్లు అర్జున్ బయటకు తీసుకువచ్చారు. అయితే ఈయన బెయిల్ గడువు పూర్తి కావడంతో నాంపల్లి కోర్టు తిరిగి ఈయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ విధంగా అల్లు అర్జున్ ఈ కేసు నుంచి ఉపశమనం పొందారని చెప్పాలి.

ఈ విధంగా అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడటంతో ఈయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అల్లు అర్జున్ బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన రాంగోపాల్ పేట పోలీసులు ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు.

ఇలా ఈయనకు బెయిల్ మంజూరు అయినప్పటికీ పోలీసులు నోటీసులు అందజేయడానికి కారణం లేకపోలేదు. సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడమే కాకుండా ఆమె కుమారుడు శ్రీ తేజ్ కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం ఈ చిన్నారి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వైద్యులు వెంటిలేటర్ సహాయంతో తనుకు చికిత్స అందజేస్తున్నారు.

ఈ ఘటన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యక్తులు కూడా ఆ చిన్నారిని పరామర్శించలేదు కానీ అల్లు అర్జున్ ఒకరోజు జైలుకు పోయేస్తేనే ఏదో నష్టం జరిగిందని సెలబ్రిటీలంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు. కనీసం ఆ చిన్నారిని ఒక్కరు కూడా పరామర్శించలేదు అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు కురిపించడంతో సినిమా సెలబ్రిటీలందరూ కూడా శ్రీ తేజ్ ను చూడటం కోసం క్యూ కట్టారు.

ఇక అల్లు అర్జున్ పై కేసు ఉన్న నేపథ్యంలో లాయర్లు అలా వెళ్లడానికి కుదరదని చెప్పిన నేపథ్యంలో అల్లు అర్జున్ వెళ్లలేదు. అయితే ప్రస్తుతం ఈయనకు బెయిల్ రావడంతో శ్రీ తేజ్ ను చూడటం కోసం అల్లు అర్జున్ హాస్పిటల్ కి వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయాన్న నేపథ్యంలో పోలీసులు హాస్పిటల్ కు రాకూడదు అంటూ ఆయనకు నోటీసులు అందజేశారు. శాంతిభద్రతల దృష్ట్యా శ్రీతేజ్ ను చూసేందురు రావొద్దని నోటీసులు పేర్కొన్నారు.