Daaku Maharaj: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి చాలా తక్కువ అప్డేట్లు విడుదలైన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ఏమంత పెద్దగా చేయడం లేదు. అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి.
ఆ అంచనాలను బాగా మరింత పెంచేశారు నిర్మాత నాగ వంశీ. ఈ సినిమా గురించి స్పందిస్తూ ట్విట్టర్లో ఈ విధంగా రాసుకోవచ్చారు. ఇది గుర్తుందా అంటూ సమరసింహారెడ్డి లో బాలయ్య గొడ్డలి పట్టుకున్న ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. అసలైన మాస్ సినిమా ఏంటో చూపించిన సీక్వెన్స్ ఇది. నా మాటలు రాసి పెట్టుకోండి. డాకు మహారాజ్ సెకండాఫ్ లో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది. అది చూస్తే మీరు మళ్లీ పిచ్చెక్కిపోతారు. అప్పటి రోజులకి వెళ్లిపోతారు. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు. మీరే చూద్దురు గానీ వెయిట్ చేయండి అని అన్నారు నాగవంశీ. అయితే ఆయన చేసిన ట్వీట్ నిమిషాల్లో వైరల్ అయిపోయింది.
బాలయ్య సినిమా అంటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.. అలాంటిది సమరసింహారెడ్డి లాంటి సెకండాఫ్ ఉంటుందంటే ఇంకేమైనా ఉందా? అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికి ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉండగా తాజాగా తన ట్వీట్ తో ఆ అంచనాలను భారీగా పెంచేశారు నిర్మాత నాగ వంశీ. దానికి తోడు సమరసింహారెడ్డి అనే పదాన్ని కూడా ఉపయోగించడంతో అభిమానులు ఈ సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.