Nara Lokesh: వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి జనంలో తిరగచ్చని మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని లోకేష్ తెలిపారు. ఆయన పరదాలు లేకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతాం అంటే మాకెందుకు అభ్యంతరం అని తెలిపారు.
ఇక కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా చాలా బాగు చేశాము ఆయన నిరభ్యంతరంగా ఆ రోడ్లపై తిరగచ్చు అంటూ సెటైర్లు వేశారు. ఇక ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీల గురించి కూడా లోకేష్ మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని అన్నిటికీ తొందరపడితే ఎలా అంటూ ప్రశ్నించారు.
ఇప్పటికే ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా పెన్షన్ పెంచుతూ అర్హులైన వారందరికీ ప్రతినెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి మరి అందజేస్తున్నాము అలాగే ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా అమలు చేశాము త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వెలబడుతుందని లోకేష్ తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తుందని ఈయన తెలిపారు.
ఇదివరకు కేవలం ఒకటి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే పాఠశాలలలో మధ్యాహ్నం భోజనం పథకం అమలులో ఉండేది అయితే ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు కూడా కాలేజీలో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని ఈ విషయాన్ని మేము మేనిఫెస్టోలో ప్రకటించలేదు కానీ చేస్తున్నాము అంటూ లోకేష్ గుర్తు చేశారు. ఇలా తమ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేస్తున్నాము అయితే ప్రతిదానికి తొందర పడాల్సిన పనిలేదని ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.