Tollywood: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే చాలా కష్ట పడాలి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి చాలా కష్టాలు పడి పైకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఇంకొందరు సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో అందం అభినయం నటనతో వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత అవకాశాలు లేక సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. వీరితోపాటు ఇతర భాషల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్స్ ఎక్కువే ఉన్నారు. కానీ ఒక్కసారి హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంటే ఆ తర్వాత చేసే చిన్న పొరపాట్లతో తన చేతులారా తన కెరీర్ ను నాశనం చేసుకుంది.
వరుస సినిమాలతో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లైన హీరోను ప్రేమించింది. అంతేకాకుండా ఆ హీరోతో సహజీవనం కూడా చేసింది. ఇక ఈ విషయం ఆ హీరో భార్యకు తెలియడం ఆమె వార్నింగ్ ఇవ్వడం చివరకు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఆమె కెరీర్ క్లోజ్ అయ్యింది. ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా. ఆమె మరెవరో కాదు నిఖిత. హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది నిఖిత. అప్పట్లో అందం, అభినయంతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. 2002లో హాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వచ్చిన 2003లో కళ్యాణ రాముడు సినిమాతో హిట్ అందుకుంది. ఇందులో వేణు తొట్టంపూడి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
తెలుగులో సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగార్జున, అనుష్క జంటగా నటించిన డాన్ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించింది. అయితే అప్పట్లో గ్లామర్ బ్యూటీగా ఫేమస్ అయిన నిఖిత.. కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. అదే సమయంలో హీరో దర్శన్ ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్ కు పెళైంది. అయినా ఇద్దరు క్లోజ్ గా ఉంటూ చట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఇక వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి దర్శన్ భార్యకు తెలియడంతో ఆమె నిఖితకు వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ ఇద్దరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరకు తన భర్తపై పోలీస్ కంప్లీట్ కూడా చేసింది. చివరకు పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద రచ్చ కావడంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు కన్నడలో నిఖితను బ్యాన్ చేశారు. బ్యాన్ తీసేసిన తర్వాత కూడా నిఖితకు అంతగా అవకాశాలు రాలేదు. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను పెళ్లి చేసుకుంది.