Janhvi Kapoor: దివంగత హీరోయిన్ అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే. శ్రీదేవి బోనీ కపూర్ ల కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మొదట ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు సినిమా ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ తో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాంచరణ్ తో మరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతోంది.
టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది జాన్వీ. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇకపోతే తిరుమల శ్రీవారు అంటే జాన్వీ కపూర్ కి చాలా ఇష్టం అన్న విషయం అందరికి తెలిసిందే. ఈమెకు దైవభక్తి ఎక్కువే. అప్పుడప్పుడు షూటింగులో కాస్త గ్యాప్ దొరికితే చాలు వెంటనే తిరుమలలో వాలిపోతూ ఉంటుంది. ఏడాదిలో చాలాసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది. ఇప్పటికే గతంలో చాలాసార్లు తిరుమల కు వెళ్లిన విషయం తెలిసిందే.
తన తల్లి శ్రీదేవి పుట్టిన రోజు, వర్ధంతి, సినిమా రిలీజులు, పండగలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి తిరుమల వెంకన్నను దర్శించుకుంది జాన్వీ. కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం స్వామి వారి సేవలో పాల్గొంది. అయితే జాన్వీ వెంట ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా ఉన్నాడు. తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది జూనియర్ శ్రీదేవి. ఇందులో తిరుమల లడ్డూను తింటున్న ఫొటో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరో ఒకరితో కలిసి తిరుమల శ్రీవారికి ఆలయానికి వెళ్లే జాన్వీ కపూర్ ఈ సారి బాయ్ ఫ్రెండ్ తో కలిసి శ్రీవారిని దర్శించుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.