Devara 100 Days: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. కాగా గత ఏడాది సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్‌డ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే సాధించి హిట్ అయింది. ఏకంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ప్లాప్ కావాల్సిన ఈ మూవీ అభిమానులు, ప్రేక్షకుల పుణ్యమా అని 500 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది.
కాగా ఎన్టీఆర్ దేవర సినిమా 52 సెంటర్స్ లో 50 రోజులు ఆడి ఇటీవల 50 రోజులు ఆడిన సినిమాల్లో మంచి రికార్డ్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు దేవర సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేవర మూవీ యూనిట్ నుంచి 100 డేస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే దేవర 100 రోజులు ఆరు సెంటర్స్ లో ఆడుతుందని ప్రకటించారు. ఇంతకీ ఆ థియేటర్స్ ఏవి అన్న విషయానికి వస్తే.. ఈస్ట్ గోదావరి జిల్లాలోని మలికిపురం పద్మజ థియేటర్, మండపేట రాజారత్న థియేటర్, చిలకలూరి పేట రామకృష్ణ థియేటర్, కొత్తకోట ద్వారకా థియేటర్, కల్లూరు MNR థియేటర్, రొంపిచర్ల MM డీలక్స్ థియేటర్ లలో దేవర సినిమా 100 డేస్ ఆడినట్టు ప్రకటించారు.
The ‘X’ mark of #Devara stands unshakable with your love ❤️
100 days since the fearless waves hit the screens 🔥 pic.twitter.com/YKEXFti0Mb
— Devara (@DevaraMovie) January 4, 2025
దేవర 100 డేస్ అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ దేవర సినిమా నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసి సినిమా చివర్లో లీడ్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర 2 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అదయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా మొదలు కానుంది.