YSRCP: 2019 సార్వత్రిక ఎన్నికలలో వైకాపా పార్టీ సింగిల్గా పోటీ చేసి ఏకంగా 151 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. ఇలా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందించారు అలాగే మెడికల్ కాలేజీ లంటూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు హాస్పిటల్స్ అన్నిటిని కూడా మార్పులు చేశారు . అయినప్పటికీ ఒక వర్గం వారు జగన్ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపించడమే ఈ ఎన్నికలలో ఆయనకు 11 స్థానాలు రావడానికి కారణమైందని చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఏకంగా 175 స్థానాలను టార్గెట్ చేస్తూ ఎన్నికల బరిలో దిగారు. అయితే ఊహించని విధంగా ప్రజలు ఈయనని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించారు. దీంతో వైకాపా నాయకులు శ్రేణులు పూర్తిస్థాయిలో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ బాధ నుంచి కొంతమంది బయట పడలేదనే చెప్పాలి. ఇలా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు జగన్ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ ఎంతోమంది పార్టీ సీనియర్ నాయకులు ఓటమికి గల కారణాలను వెల్లడించారు.
ఇలా 11 స్థానాలు రావడంతో తిరిగి తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం జగన్ ఇప్పటికే ఎన్నోసార్లు పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం అయ్యి దిశా నిర్దేశాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అంటూ పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పెరిగిన విద్యుత్ చార్జీల గురించి రైతు భరోసా నిధుల గురించి పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు ర్యాలీలు చేస్తూ నిరసన తెలియజేశారు కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కనిపించడం లేదు.
ఆయన కేవలం బెంగళూరు టు తాడేపల్లి అంటూ పరిమితం కావడంతో చాలామంది ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైకాపా పార్టీకి పూర్వ వైభవం రావాలి అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మారాలని అప్పుడే పార్టీకి కూడా పూర్వ వైభవం వస్తుందని పలువురు భావిస్తున్నారు. జగన్ ప్రతి ఒక్కరికి తాను అండగా ఉన్నానంటూ ప్రజలలోకి వచ్చి భరోసా ఇవ్వాల్సింది పోయి మీరు నిరసనలు చేయండి అంటూ అందరినీ ముందుకు తోస్తూ ఈయన మాత్రం ప్యాలెస్ లకే పరిమితం అయితే వైకాపా చరిత్రలో కలిసిపోతుందంటూ మరికొందరు జగన్ తీరును విమర్శిస్తున్నారు.