Janasena: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఇలా రాజకీయాలలో కూడా ఈయన కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు కేవలం ఆయన కమిట్ అయిన సినిమాలను మాత్రమే వీలైనప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి తన అన్నయ్య కుమారుడు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి అలాగే సినిమాలకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావన చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత రాజకీయాలలోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించారు అయితే ఒకానొక సమయంలో నాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కానీ నా దగ్గర డబ్బు లేకుండా పోయింది. అలాంటి సమయంలో పార్టీని ముందుకు నడిపించడానికి చాలా కష్టంగా మారింది. ఇలాంటి కష్ట సమయాలలో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా నాకు ఒక ఇంధనంలా మారిందని ఆ డబ్బుతోనే జనసేన పార్టీని నడిపించానని పవన్ తెలిపారు.
పార్టీ పెట్టాను పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి డబ్బు లేదు అలాంటి సమయంలో నా సినిమాలకు మార్కెట్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితులలో దిల్ రాజు నాతో వకీల్ సాబ్ సినిమా చేశారు. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది ఇలా వకీల్ సాబ్ సినిమాతో నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ద్వారా పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలిగాను అంటూ దిల్ రాజు గురించి ఆయన నిర్మించిన వకీల్ సాబ్ సినిమా గురించి పవన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.