తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో తన మద్దతు ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌కే అని ఆమె చెప్పుకొచ్చింది.
భార్యగా తాను హర్ట్ అయినా, వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో ఇష్టమనీ, అన్ని రకాల లగ్జరీయస్ లైఫ్‌నీ వదిలేసుకుని ఆయన ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారనీ, ఆయనకు మద్దతుగా నిలబడాలనీ, సీఎంగా ఆయనను చూడాలనుకుంటున్నాననీ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
అసలు సడెన్‌గా రేణూ దేశాయ్ ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేసినట్లు.? ఎవరైనా ఆమెతో ఇలా చెప్పించారా.? గతంలోనూ పవన్ కళ్యాణ్‌పై కొన్ని నెగిటివ్ ఆరోపణలు చేసింది రేణూ దేశాయ్. అప్పుడు కూడా రేణూ దేశాయ్‌తో ఎవరో అలా మాట్లాడించారన్న అనుమానాలున్నాయ్.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. రేణూ దేశాయ్‌తో ఎవరు చెప్పిస్తున్నారు.? అనే అనుమానాలు సినీ రాజకీయ వర్గాల్లో చర్చకొస్తున్నాయ్. అసలు రేణూ దేశాయ్ ఎప్పుడూ నిజం మాట్లాడదా.? అని అసహనం కూడా వ్యక్తమవుతోంది కొన్ని వర్గాల్లో.