Keerthi Suresh: గత వారం రోజులుగా హీరోయిన్ కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారుమగుతున్న విషయం తెలిసిందే. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని చిన్ననాటి స్నేహితుని పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా చాలాసార్లు వార్తలు వినిపించడంతో అభిమానులు ఇవి కూడా అవాస్తవాలు అని కొట్టి పారేశారు. కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో మరి ఎక్కువగా వినిపించడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ సురేష్ తండ్రి ఒక విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ కు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్ తోనే వివాహం జరగబోతోందని అధికారికంగా చెప్పారు. గోవాలోని ఒక రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరుగుతుందని అన్నారు. దీంతో కీర్తి సురేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి రూమర్లన్నింటికీ చెక్ పడిందని, ఇకనైనా ఆపాలంటూ రూమర్లు క్రియేట్ చేసేవారిని వారు విన్నవించుకుంటున్నారు.
డిసెంబరు 11 లేదంటే 12వ తేదీన వీరి వివాహం జరగబోతోందట. నెటిజన్లు కీర్తిసురేష్ – ఆంటోని తటిల్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకొందరు అభిమానులు మాత్రం ఇలా కీర్తి సురేష్ ఊహించని విధంగా షాక్ ఇవ్వడంతో ఇది నిజమా లేక బ్రమనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తాను అధికారికంగా ప్రకటిస్తాను అని చెప్పిన కీర్తి సురేష్ ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.