బాలీవుడ్ ని యేలేయడానికి సిద్ధమవుతున్న టాలీవుడ్!! పుష్ప 2తో అది నిజం కానుందా?

తెలుగు సినీ ఇండస్ట్రీకి హిందీ సినీ ఇండస్ట్రీకి చాలా తేడాలు ఉన్నాయి. హీరో, హీరోయిన్ ల రెమ్యూనషన్లతో పాటు సినిమా ప్రొడక్షన్ ఇంకా ప్రమోషన్లలో కూడా రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఏదైనా సినిమా విడుదలవుతుందంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఆన్లైన్ లో ప్రమోషన్లు మొదలు పెడతారు. కానీ టాలీవుడ్ లో ఏదైనా సినిమా వస్తుందంటే టీజర్, ట్రైలర్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో లాంచ్ లు అంటూ చాలానే సందడిగా ఉంటుంది.

అందులోనూ దగ్గర్లో ఏదైనా పెద్ద హీరో సినిమా విడుదలకు ఉంది అంటే అది ఒక పెద్ద పండగలానే జరుగుతుంది. ఏ చిన్న ఈవెంట్ పెట్టినా వేల కొద్ది జనాలు వస్తూనే ఉంటారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్లో ఇలాంటివేవి ఉండవు. ప్రమోషన్లు చేయాలన్నా కాఫీ విత్ కరణ్, కపిల్ శర్మ షో వంటి ప్రోగ్రామ్స్ లో పాటిస్పేట్ చేసి ప్రమోషన్లు చేస్తారు సినిమా టీం.

బాలీవుడ్ కన్నా టాలీవుడ్ ప్రమోషన్లలో ఒక అడుగు ముందే ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం భారతదేశమంతా ప్రమోషన్లు హోరాహోరీగా చేయడం బాహుబలి సినిమా నుంచి మొదలైంది. ఇప్పుడు దాన్ని పుష్ప 2 కొనసాగిస్తుంది. ఈ మధ్యనే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అవ్వగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని పాట్నాలో ఆర్గనైజ్ చేశారు పుష్ప టీం. వేలకొద్దీ హిందీ ప్రేక్షకులు అక్కడికి తరలివచ్చి ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు.

అలాగే యూపీలో రాంచరణ్ నటించిన గేమ్స్ టీజర్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. తెలుగు హీరోలు దేశమంతటా జోరున ప్రమోషన్లు చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. ఇలానే సాగితే బాలీవుడ్ హీరోలకి తెలుగు హీరోల వల్ల వణుకు వచ్చే సమయం మొదలైనట్టే. ఇప్పటికైనా వాళ్లు ప్రమోషన్లు మంచిగా చేయడం మొదలు పెట్టకపోతే బాలీవుడ్ ను కూడా టాలీవుడ్ యేలేయడం ఖాయం. ఇప్పటికే పుష్పా 2తో అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.