లేడీ డైరెక్టర్‌ని దూరం పెట్టిన యంగ్ హీరో.!

ఆ లేడీ డైరెక్టర్ అతనికి గతంలో హిట్టు ఇచ్చింది. అయితే, అందులో అతనిది పెద్ద పాత్ర ఏమీ కాదు. కానీ, ఆమెకీ అతనికీ అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.

ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ముందుకొచ్చింది. ఇంతలోనే, ఆ డైరెక్టరు సినిమా ఫెయిల్ అయ్యింది. దాంతో, పట్టాలెక్కాల్సిన కొత్త ప్రాజెక్టు అటకెక్కిందట. ఆ డైరెక్టర్ నీడ పడకుండా జాగ్రత్తపడుతున్నాడట ఆ హీరో ఇప్పుడు.

ప్రస్తుతం ఆ యంగ్ హీరో తనకు హిట్టు ఇచ్చే దర్శకులెవరబ్బా.? అని ఆరా తీస్తున్నాడట. కూల్ అండ్ లవ్లీగా కనిపించే ఆ హీరో, లేనిపోని హీరోయిజం జోలికి వెళ్ళి చేతులు కాల్చుకున్నాడు.

అయినా, మాస్ సినిమాల మీద మోజు తగ్గలేదు. కానీ, అతనితో అంత బడ్జెట్ సినిమాలంటే ఎవరూ ముందుకు రావడంలేదు. వాట్ నెక్స్‌ట్.?