మెగాస్టార్ చిరంజీవి చిన్న ‘బ్రేక్’ కోసం విదేశాలకు పయనమైన సంగతి తెలిసిందే. తిరిగొచ్చాక, కొత్త సినిమా షూటింగ్లో బిజీ అవుతానని చిరంజీవి పేర్కొన్నారు కూడా.
తన సతీమణితో కలిసి విహార యాత్రల కోసం విదేశాలకు చిరంజీవి వెళ్ళడం కొత్తేమీ కాదు. కోవిడ్ నేపథ్యంలో, విదేశీ పర్యటనలు కొన్నాళ్ళపాటు తగ్గాయి. తిరిగి ఇప్పుడు చిరంజీవి, తన రొటీన్ లైఫ్‌లోకి వచ్చేశారు.
కానీ, తెరవెనుకాల చిరంజీవి విదేశీ పర్యటనల గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. శరీరాన్ని ఫిట్‌గా వుంచుకునేందుకు చిరంజీవి కొన్ని రకాలైన వైద్య చికిత్సలు విదేశాల్లో చేయించుకుంటున్నారన్నది ఆ గాసిప్స్ సారాంశం.
ఇలాంటి ప్రచారంపై చిరంజీవి గతంలోనే అసహనం వ్యక్తం చేసినా, చూచాయిగా ఖండించినా.. అవలా కొనసాగుతూనే వున్నాయ్.
‘చూస్తూనే వుండండి.. బాస్ న్యూ లుక్కుతో వస్తారు..’ అంటూ అభిమానులు ఆశిస్తుండడమే, చిరు మేకోవర్ కోసం.. ఫిజిక్ ఆర్డర్ కోసం విదేశాలకు వెళుతున్న వైనాన్ని చెప్పకనే చెప్పేస్తోంది.