జక్కన్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ ‘ఇది’ అంటూ హింట్ కూడా ఇచ్చేశాడు జక్కన్న.
గ్లోబ్ ట్రోటింగ్ నేపథ్యంలో ఆ సినిమా కథ వుండబోతోందనీ చెప్పాడు రాజమౌళి. అంతా బాగానే వుంది కానీ, రాజమౌళి ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నుంచి బయటికి రాలేదు. తాజాగా ‘నాటు నాటు.. ’ సాంగ్‌కి ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు కొట్టి ఫుల్ ఖుషీ మీదున్నాడు దర్శక ధీరుడు.
ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్‌ఆర్’కి సీక్వెల్ వస్తే బావుంటుందంటూ ప్రపపంచ వ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. అవును నిజమే కదా.. ఇదే జోరులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సీక్వెల్ తీస్తే ఎలా వుంటుంది.? అని రాజమౌళికి అత్యంత సన్నిహితులు సలహా ఇస్తున్నారట.
మరి, జక్కన్న మనసు మార్చుకుంటే, మహేష్ సినిమా పరిస్థితేంటీ.? ఏమో చెప్పలేం. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రాజెక్టులు కాస్త అటూ ఇటూ అవుతుంటాయ్. అలా మహేష్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లి, ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ సెట్స్ మీదికి వెళ్లనుందేమో. ఒకవేళ అదే జరిగితే, ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్‌కి పండగే సుమా.