‘ముఖ్యమంత్రి అభ్యర్థులు మా పార్టీలో చాలామందే వున్నారు.. అందులో పురంధరీశ్వరి కూడా ఒకరు..’.. కొన్నాళ్ళ క్రితం బీజేపీ నేతలు కొందరు, ‘జనసేన – బీజేపీ’ ఉమ్మడి ముఖ్యమంత్రి ఎవరు.? అన్నదానికి సంబంధించి చేసిన వ్యాఖ్య ఇది.
ఆ పురంధరీశ్వరి ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరికి స్వయానా సోదరి ఈ పురంధరీశ్వరి. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలోకి వచ్చారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధరీశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బీజేపీ అధినాయకత్వం అవకాశం ఇవ్వడం ఆసక్తికర పరిణామమే. సోము వీర్రాజుని ఎందుకు తప్పించారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
పవన్ కళ్యాణ్‌కి సోము వీర్రాజు అత్యంత సన్నిహితుడు. కానీ, ఆ సాన్నిహిత్యం వల్ల జనసేన – బీజేపీ బంధం మరీ ఏమంత బలపడలేదు. నిజానికి, పురంధరీశ్వరి – పవన్ కళ్యాణ్.. ఇలా ఇప్పుడు ఏపీ బీజేపీ – జనసేన బంధం బలపడేందుకు ఆస్కారం వుంది. కారణం, భువనేశ్వరి మాట తీరు.!
అయినాగానీ, ఏపీలో బీజేపీకి అంత సీన్ వుందా.? అదే మిలియన్ డాలర్ క్వశ్చన్. ఒకప్పుడు భువనేశ్వరి – చంద్రబాబు మధ్య రాజకీయ విభేదాలుండేవి. ఇప్పుడవి బాగాతగ్గిపోయాయి. ఎలా చూసినా బీజేపీ – టీడీపీ – జనసేన కాంబినేషన్‌కి ఈ మార్పు చాలా చాలా దోహదపడొచ్చు.
అయితే, ఈ కాంబినేషన్ రాజకీయంగా ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.