బ్రో ట్రైలర్ విడుదలైంది. విడుదలైన 20 గంటల్లోనే 15 మిలియన్స్ వ్యూస్ ని సంపాదించుకుంది. అందులోని డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే రాజకీయంగా పవన్ వ్యవహారశైలికి “బ్రో” ట్రైలర్ లోని డైలాగ్స్ బాగా సరిపోయాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం వైరల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
తాజాగా పవన్ కల్యాణ్ ఒక ట్వీట్ చేశారు. “అందరి ఆందోళన ఒక్కటే.. మై డియర్ వాట్సన్!.. మీరు సీఎం అయినా కాకపోయినా డేటా గోప్యతా చట్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ మూడు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
1) వలంటీర్ల బాస్ ఎవరు?;
2) ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ దాస్తున్నారు?;
3) వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు… ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?” అని పవన్ ప్రశ్నించారు.
ఆ సంగతి అలా ఉంటే… పవన్ కల్యాణ్ ఇప్పటికే వాలంటీర్లకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ఎన్నో విమర్శలు మూటగట్టుకున్నారు. ఇవాలో రేపో కోర్టు మెట్లక్కబోతున్నారు. నేరం రుజువైతే రెండేళ్లు శిక్ష అనుభవించాల్సి వస్తోందని అంటున్నారు. ఈ సమయంలో పవన్ లో పశ్చాత్తాపం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పైగా ఒక్కసారి కోర్టుకు వెళ్లిన తర్వాత ప్రభుత్వం తరుపున పబ్లిక్ ప్రాసిక్యుటర్ అడిగే ప్రశ్నలు.. పవన్ చేసిన వ్యాఖ్యలు.. అనంతరం వచ్చే తీర్పు పై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో పవన్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయనే కామెంట్లు సైతం వినిపిస్తుండటం గమనార్హం.
దీంతో జాగ్రత్తగా, హుందాగా, వివదాలకు తావు లేకుండా.. కష్టపడి, ప్రజలను ఒప్పించే నేర్పు సంపాదించుకుని రాజకీయాలు చేసుకుని ఉంటే కచ్చితంగా ప్రయోజనం ఉండేది.. చంద్రబాబు కోసం పనిచేసే విషయం ప్రజల్లోకి విపరీతంగా వెళ్లిపోయి, ఇప్పుడు ఏపీలో ఏన్డీయే ప్రభుత్వం అంటూ కబుర్లు చెబుతూ.. వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల “బ్రో” సినిమా డైలాగుని పవన్ కి అప్లై చేసేలా ఉన్నాయని తెలుస్తుంది.
ఈ సందర్భంగా పవన్ నటించిన “బ్రో” సినిమా ట్రైలర్ లో… “భస్మాసురుడు అని ఒకడు వుండేవాడు తెలుసా. మీ మనుషులందరూ వాడి వారసులు. ఎవడి తలమీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవడికీ చాన్స్ ఇవ్వడు” అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ ను పవన్ ప్లిటికల్ కెరీర్ కి అప్లై చేస్తున్నారు నెటిజన్లు. తనలోనే భస్మాసురుడు ఉన్నాడని పవన్ గుర్తించకపోవడమే రాజకీయ విషాదం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా… వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… న్యాయపరంగా ఉన్న అంశాలను లోతుగా పరిశీలించిన తరువాత, హైకోర్ట్ మెట్లు ఎక్కి పరువు నష్టం కేసు వేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 16ను రిలీజ్ చేసింది.