జర్నలిస్ట్ కులదీప్‌ నయ్యర్‌ తెలంగాణను వ్యతిరేకించారు 

(దుర్గం రవీందర్)

ప్రముఖ పాత్రికేయుడు,దౌత్యవేత్త,పార్లమెంటేరియన్‌, గ్రంథకర్త కులదీప్‌ నయ్యర్‌. తొమ్మిదిన్నర దశాబ్దాల పూర్ణ జీవితం ఆయనది.పలు సందర్భాల్లో ఆయన చూపిన తెగువ , రాజీలేనితనం భారతీయ పాత్రికేయులందరికీ ఆదర్శం. ఆయన ప్రజాపక్షపాతి. కుల్‌దీప్‌ నయ్యర్‌ కీర్తికీ,ధనానికీ దాసోహపడలేదు. వ్రుత్తి ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చారు కనుకనే పాత్రికేయ రంగంలో మేరునగసమానుడయ్యారు.ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించి అరెస్టులు నిర్బంధాలకు వెరవకుండా పత్రికాస్వేచ్ఛకోసం జరిపిన పోరాట స్ఫూర్తిని జీవితపర్యంతం కొనసాగించారు. 25 ఏళ్ల వయసులో దేశ విభజనను మతం పేరిట సాగిన హింసను ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్ట్.భారత దేశంలో కుల,మతాలకు తావుండరాదని చెపుతూనే,అందుకోసమే పనిచేస్తున్నాని జీవిత పర్యంతమూ చెప్పుకున్న కులదీప్‌ నయ్యర్‌ ఆచరణలో అని వేళల కులాన్ని మతాన్ని ఎండా గత్తడంలో ఉదాసీనత ప్రదర్శించారు. ఆయన కలానికీ గళానికీ శషభిషలు లేవు. నమ్మినదానిని నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పడం ఆయన నైజం అంటారు కాని తెలంగాణా ప్రత్యెక రాష్ట్ర డిమాండ్ ను కారణం చూపకుండా వ్యతిరేకించారు.బహుశా ఆయన సీమాన్ద్రుల మాయకు గురయ్యారు కాబోలు .

పాకిస్తాన్ సియాల్‌ కోట్‌లో పుట్టి అక్కడే డిగ్రీవరకూ చదువుకొని హిందువు కాబట్టి దేశ విభజన కాలంలో ఇటు వచ్చారు. పత్రికారంగo లో ప్రవేశించి జీవిత చరమాంకం వరకూ అదే రంగానికి నిబద్ధుడైనారు. మొదట ఉర్దూ పత్రిక అంజామ్‌లో చేర గానే గాంధీ హత్యకు గురికావడం దానికి సంబంధించిన భిన్న కోణాలను రాయ వలసి రావడం ఆయనమీద ప్రభావం చూపిందని అంటారు. దేశ విభజన గాయాలను ప్రత్యక్షంగా చూసినవాడు కనుక భారత్‌ పాక్‌ మధ్య సత్సంబంధాలను అమితంగా కాంక్షించారు. నెహ్రూ మరణం లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధాని కావడం ఆ తరువాత తాష్కెంట్‌లో అనుమానాస్పదంగా చని పోవడం ఇందిర గద్దె నెక్కడం-దిగిపోవడం మొరార్జీ ప్రదాని కావడం ,వీపి సింగ్ మొదటి బ్రామ్మనేతర ప్రదాని కావడం వంటి పలు చరిత్రాత్మక ఘటనలతో పాటు తెరవెనుక వ్యవహారాలు కూడా తెలిసినవాడు ఆయన.కాని ఎందుకనో వాటిని విశ్లేషించడంలో కులాన్ని ఆయన ప్రాతిపదికగా తీసుకోలేదు.

పత్రికలపై పాలకులు కన్నెర్ర చేసినప్పుడల్లా కాచుకొనేవారు. భారతదేశంలోని దాదాపు అన్ని పెద్ద చిన్న పత్రికలతో పాటు పాకిస్థాన్‌,ఇంగ్లాండ్ దినపత్రికలు కూడా ఆయనను కాలమిస్టుగా గౌరవించుకున్నాయి. కుల్‌దీప్‌ నయ్యర్‌ జీవితపర్యంతం పాత్రికేయుడిగా హక్కుల ఉద్యమకారుడిగా నిలిచారు.

(సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరించిన వార్త)