గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాని నార్త్ అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.ఈ ఈవెంట్లో రామ్ చరణ్ శంకర్, హీరోయిన్ కియారా అద్వానీ, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అంజలి, ఎస్ జె సూర్య పాల్గొన్నారు.
అయితే స్టేజ్ మీద ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఓజీ అప్డేట్స్ కోసం ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా ఎన్నారై ఫ్యాన్స్ అరవటం ప్రారంభించారు. అప్పుడు చరణ్ మాట్లాడుతూ నేను కూడా ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే ఎలా అయినా కళ్యాణ్ బాబాయ్ ని ఒప్పించి ఈ సంక్రాంతికి సినిమా వచ్చేలా చేసే వాడిని అని చెప్పడంతో ఆడిటోరియం మారుమోగిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు.
ఓజీ సినిమా కన్నా ముందు హరిహర వీరమల్లు సినిమా వస్తుందని తెలిసినప్పటికీ ఎక్కువగా ఓజీ అప్డేట్స్ కోసమే ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే ఈ అనుభవం రామ్ చరణ్ కి మాత్రమే కాదు తమన్ కి ఎస్ జె సూర్య కి కూడా ఎదురయింది. తమన్ స్టేజ్ మీద మాట్లాడటం ప్రారంభించగానే అతని మాటలు వినిపించనంత హూరులో ఓజీ అప్డేట్స్ కోసం ఆడిటోరియం ని హోరెత్తించారు. అయితే ఓజీ మ్యూజిక్ గురించి చెప్తూ ఇంతకు ముందు భీమ్లా నాయక్, బ్రో, వకీల్ సాబ్ కి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చానో తెలుసు కదా.
ఇప్పుడు అంతకుమించి ఉంటుంది అని చెప్పడంతో ఆడిటోరియం మరొకసారి పవన్ పేరుతో మారుమ్రోగిపోయింది. ఇదే అనుభవం ఎస్ జె సూర్యకి కూడా ఎదురయింది. ఆయన పవన్ పేరు ఎత్తేసరికే రెండు మూడు నిమిషాల పాటు మరే సౌండ్ వినిపించనంత అల్లరి తో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. దేశం కానీ దేశంలో కూడా పవన్ క్రేజ్ చూసి కాలర్ ఎగరేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.