తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

తెలంగాణలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

అయితే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుండటంతో నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరగనుంది. మొదట 12 నెలల కాలానికి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా పెంచనున్నారని సమాచారం అందుతోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి,కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్,నిర్మల్ తో పాటు ఖమ్మం , కామారెడ్డి , రాజన్న సిరిసిల్ల ,వికారాబాద్ లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫాథాలజీ,ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాలతో పాటు ఫార్మాకాలజీ, మైక్రోబయాలజీ,, కమ్యూనిటీ మెడిసిన్‌,అనాటమీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. 69 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు గరిష్టంగా 1,90,000 రూపాయల వేతనం లభిస్తుంది. dmerecruitment.contract@gmail.com ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను పంపే అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్ 15వ తేదీ దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ కాగా అక్టోబర్ నెల 20వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు కౌన్సిలింగ్ ను నిర్వహిస్తారు.