తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 18 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. 24 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జర్నలిజంలో డిగ్రీ/మాస్ మీడియా చేసి జర్నలిజంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానిక్ అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నివాసం ఉండాలని సమాచారం అందుతోంది. www.newsonair.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వ్యక్తిగత వివరాలను సైతం పొందుపరచాల్సి ఉంటుంది. దరఖాస్తుతో స్వయం ధృవీకరణ చేసిన సర్టిఫికేట్ల కాపీలను జత చేసి ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ లను సైతం జత చేయాల్సి ఉంటుంది. https://prasarbharati.gov.in/pbvacancies/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2023 సంవత్సరం జులై నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.