తెలంగాణలో పోలీస్ రిక్వైర్ మెంట్ శరవేగంగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.కోర్టు ఆదేశాలతో ఇటీవల ప్రిలిమ్స్ పరీక్షలో 7 మార్కులను కలిపారు. ఈ మార్కులను కలపడంతో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రస్తుతం ఈవెంట్స్ ను నిర్వహిస్తోంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఈ సందర్భం ఈ ఈవెంట్స్ లో భాగంగా తెలంగాణ సర్కార్ గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మినహాయింపు ఇచ్చింది. ఈ బాలింతలు గర్భిణీ స్త్రీలు
నేరుగా తుది పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది.
ఫైనల్ ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలు విడుదలైన నెల రోజుల్లో వారు ఈవెంట్స్ లో అర్హత సాధించాల్సి ఉంటుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మినహాయింపు పొందాలనుకుంటున్న వారు రాత పూర్వక అండర్ టేకింగ్ ను సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా అండర్ టేకింగ్ ను Director General of Police, Telangana State, Lakdi-ka-pul, Hyderabad చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.
ఇందుకు సంబంధించిన ప్రొఫార్మాను పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.దీనితోపాటు అభ్యర్థులు బోనఫైడ్ సర్టిఫికెట్ కూడా జత చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళ పోలీస్ రిక్రూట్మెంట్ అభ్యర్థులకు ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పడంతో మహిళ అభ్యర్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.