తెగువే మగువై..!

చిదిమితే పాల్గారు బుగ్గల వయసులో జరిగిన పెళ్లిని తానుగా పెటాకులు చేసిన ధీశాలి.. టికెట్ లేదని నెహ్రూనే అడ్డగించిన ధైర్యశాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా స్వరాజ్య సంగ్రామంలో వెన్ను చూపక ఆపన్నులకు దన్నుగా నిలిచిన సహనశీలి.. దుర్గాబాయి దేశముఖ్..!

ఆంగ్లంలో బోధన నప్పక ఆ చదువు ఒప్పక.. బడి మానేసినా చదువును ఆపక.. లాయరై.. ఉన్నత పదవుల ప్రస్థానం.. సంస్కరణలకే కారణమైన మేధావి.. ఢిల్లీకీ చేరిన తావి!

ఆభరణాలపై మోజు లేదు సంస్కరణల్లో రాజీ పడదు.. తెలిసింది చెప్పడమే.. అనుకున్నది చెయ్యడమే.. ఈ తెగువ..ఆ మగువను బాపూ దాపులకు చేర్చింది సంగ్రామంలో ధృవతారగా.. స్వతంత్ర భారతంలో చెరిగిపోని చరిత్రగా..!