ఏపీ పాలిటిక్స్: వణికిస్తున్న పవన్ కల్యాణ్ కదలికలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుకు కొత్త పేజీ తెరిచినట్లైంది. 2024 ఎన్నికల విజయంతో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పవన్, ఇప్పుడు కాకినాడ రాజకీయ, వ్యాపార వర్గాల్లో తన కదలికలతో హాట్ టాపిక్ అవుతున్నారు. వైసీపీ హయాంలో తనను విమర్శించిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిపై పవన్ రాజకీయ కౌంటర్‌కు మించి, వ్యాపార రంగంలో కూడా చెక్కుచెదరనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పౌర సరఫరాల శాఖకు సంబంధించి తన ప్రాధాన్యతను చూపుతూ, రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల త‌నిఖీలను పకడ్బందీగా నిర్వహించారు. ద్వారంపూడి ఆధ్వర్యంలోని మిల్లులు, అక్రమ రవాణా, రేషన్ బియ్యం స్కాంలపై కూపీ లాగారు. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో సాగిన ఈ తనిఖీల్లో ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం, అధికారుల చేతుల్లోకి పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు చేరడం విశేషం.

అలాగే కాకినాడ పోర్టులో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యం వ్యవహారంలో పవన్ ప్రణాళిక బలంగా అమలు చేస్తున్నారు. విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ, వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ సహా మరికొన్ని ఫ్యాక్టరీలను మూసివేయడం ద్వారంపూడి వ్యాపారాలకు పెద్ద దెబ్బగా మారింది. ఈ క్రమంలో ద్వారంపూడి వ్యాపారాలు క్రమంగా సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి పవన్ కల్యాణ్ తన మాటలు వాస్తవంగా ఎలా మారుతాయో ఆచరణలో చూపిస్తున్నారు. ద్వారంపూడి వ్యాపారాలపై నడిపిస్తున్న ఈ చర్యలు, రాజకీయాలను మించి పౌర సంబంధాల పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కాకినాడలో చర్చనీయాంశమయ్యాయి. పరిశీలకులు ఈ పరిణామాలను పవన్ కల్యాణ్ కొత్త ధోరణిగా అభివర్ణిస్తున్నారు.