మాటల మూటల రాజు.. నరసరాజు జయంతి

ఆయన నరసరాజు.. మాటల్లో నవరసరాజు.. గుండమ్మనే గడగడలాడించిన పలుకుల రసరాజు.. హిట్టు మీద హిట్టు కొట్టి యమగోల పుట్టించిన వరసరాజు..!

అయ్యోయ్.. ఇక్కడ నాకు గుండక్క గారి ఇంట్లో పని కుదిరింది.. సానా బాగా సూసుకుంటున్నారు.. కడుపు నిండా బువ్వెడుతున్నారు.. కట్టుకోడానికి బట్టలిత్తున్నారు.. పెళ్లి కూడా సేత్తామంటున్నారు.. ముక్కెంగా మూడు ముక్కలు ఇక్కడ బల్లెమ్మని ఉంది.. నేనంటే సానా ఇది.. సానా అది.. ఇంక ఆల్లూ ఈల్లూ ఎందుకు బల్లెమ్మనే ఇచ్చి పెళ్లి సెయ్యమని గుండక్కని అడుగుదామనుకుంటున్నా.. ఇలా కూడా ఉత్తరం రాయొచ్చా.. అంజి అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు ముక్కలు.. కడుపు ముక్కలు చెక్కలు..!

దిబ్బ మీద దేవయ్య కూతుర్ని..  నేను రాతి మీద కోటయ్య మనవరాల్ని.. ఇవి పిడకలు చేసిన చేతులు.. ఇవి జొన్నలు దంచిన చేతులు… కొలాయి గట్టు మాటలూ నరసరాజు విప్పిన మూటలే!

యముడికే దడ పుట్టించిన గోల.. డైలాగుల హేల… సంజయుడికే సెటైరు.. ఎమర్జెన్సీ దురాగతాలపై పలికెడిది నందమూరి.. పలికించెడి వాడు తాతినేని.. లిఖించిన వాడు దాట్ల నరసరాజు.. యముండ.. ప్రతి పలుకు ఓ కలకండ..!