మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ డిజాస్టర్ అని భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంత పెద్ద డిజాస్టర్ అయితే, గోల గోల జరుగుద్ది కదా. ఎందుకింత సైలెంట్‌గా వుంటుంది. కేవలం ఇదంతా సోషల్ మీడియా గందరగోళం తప్ప సినిమా వల్ల నష్టపోయాం.. అని ఎవ్వరూ ఇంతవరకూ ముందుకు వచ్చింది లేదు.
చిరంజీవి 10 కోట్లు వెనక్కిచ్చేశారట, కాదు కాదు 20 కోట్లు వెనక్కిచ్చేశారట.. అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్.. నిజానికి ఆ గొడవే లేదంట ఇంతవరకూ.. నిర్మాత చిరంజీవిని ఇబ్బంది పెట్టింది లేదట. చిరంజీవి, నిర్మాతని మొహమాటపెట్టిందీ లేదట.
ఒకవేళ ఎలాంటి ఇబ్బంది వచ్చినా చిరంజీవి చూసుకుంటార్లే అన్న ధీమాతో అందరూ వున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అంత దారుణమైన నష్టాలొచ్చాయని ప్రచారం జరుగుతున్నా ఇంత సైలెంట్‌గా నిర్మాతలుండడం నిజంగా గొప్ప విషయమే. అన్నివిషయాలపైనా త్వరలో ఓ స్పష్టత రానుంది.
ప్రస్తుతం చిరంజీవి ఓ మైనర్ సర్జరీ కారణంగా రెస్ట్‌లో వున్నారు. ఆయన కోలుకోగానే, అనిల్ సుంకరతో కలిసి కూర్చుని మాట్లాడి ఈ మ్యాటర్ సెటిల్ చేయనున్నారట.