నిన్న చిరంజీవితో.. రేపు బాలయ్యతో.! ఊర్వశి పంట పండిందే.!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఊర్వశి రౌతెలాని తీసుకొచ్చారు. ‘బాస్ పార్టీ’ స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్‌తో అందాల ఊర్వశి డాన్సులేసింది.

చిరంజీవితో డాన్స్ చేయడం తన అదృష్టమంటూ ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చింది ఊర్వశి. అంతేనా, రవితేజతోనూ డాన్స్ చేయాలని వుందంటూ తన మనసులో కోరికను బయటపెట్టేసింది. రవితేజ కూడా ఆమె కోరికను మన్నించాడనీ, త్వరలో ఇద్దరూ కలిసి ఓ సినిమాలో డాన్స్ చేయనున్నారనీ ప్రచారం జరుగుతోంది.

ఇంకోపక్క, నందమూరి బాలకృష్ణతో ఊర్వశి రౌతెలా సాంగ్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. బాలకృష్ణ తదుపరి సినిమా కోసం ఊర్వశిని ఐటమ్ బాంబ్‌గా ఫిక్స్ చేసేశారట.

ఆ వివరాలు కొద్ది రోజుల్లోనే వెల్లడి కానున్నాయి. అనిల్ రావిపూడి సినిమా కోసమన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అన్నట్టు, ఊర్వశి నటించిన తొలి తెలుగు సినిమా ‘బ్లాక్ రోజ్’ ఏమైనట్టు.?