పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” సినిమా వివాదాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. ఈ సినిమాలో ఫృధ్వీ నటించిన “శ్యాంబాబు” పాత్రతో పుట్టిన వివాదం సృష్టించిన దుమారం సంగతి తెలిసిందే. ఈ విషయంపై పవన్ ని మంత్రి అంబటి రాంబాబు గ్యాప్ ఇవ్వకుండా వాయిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో అంబటితో పాటు వైసీపీ కీలక నేతలు పవన్ పై సెటర్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ వైపు నుంచి ఒక మాట వస్తే మరో వైపు నుంచి పది మాటలు అవిరామంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రేణూ దేశాయ్ ఒక వీడియో విడుదల చేశారు.
తాజాగా “బ్రో” వివాదంపై పవన్ రెండో మాజీ భార్య రేణు దేశాయ్ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పవన్ కల్యాణ్ తనకు అన్యాయం చేసినా సమాజానికి న్యాయం చేస్తాడన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో “బ్రో” వివాదంపైనా స్పందించారు. దీంతో తాజాగా అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు.
అవును.. మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా పవన్ రెండో మాజీ భార్య రేణూదేశాయ్ కు సలహా ఇచ్చారు. “అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. బ్రో ని వెంటాడే విషయంలో అంబటి తగ్గడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!
కాగా… పవన్ సినిమా వివాదం గురించి తనకు పెద్దగా తెలియదని.. కొందరు పవన్ పెళ్లిళ్లు, పిల్లల గురించి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తానంటున్నారని ఆమె వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దయచేసి ఆ వివాదంలోకి పిల్లలను లాగకండి అంటూనే.. పవన్ చాలా నిజాయితీపరుడు అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తనకు కచ్చితంగా ద్రోహం చేశారని చెప్పుకొచ్చిన రేణూ దేశాయ్… సమాజానికి మాత్రం పవన్ మంచిచేస్తాడని చెప్పుకొచ్చారు. అనంతరం… ఆయనకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని.. అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాలంటూ వేడుకొన్నారు.
ఆ వీడియో పోస్ట్ అయిన అనంతరం అంబటి “అమ్మా రేణూ!” అంటూ ఇలా తనదైన శైలిలో స్పందించారు.