దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజను ఎందుకు చేస్తారు.. పూజ ఎప్పుడు చేయాలి?

సాధారణంగా దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని పూజిస్తారు.ఈ విధంగా ఆరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తూ పూజిస్తుంటారు.ఈ విధంగా దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించడానికి గల కారణం ఏంటి.. మన పురాణాలు ఏం చెబుతున్నాయనే విషయానికి వస్తే… పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి దేవేంద్రుడి ఆతిథ్యం మేరకు ఆయన ఇంటికి వస్తారు.

ఈ విధంగా దుర్వాస మహర్షి దేవేంద్రుడు వద్దకు వస్తున్న సమయంలో ఒక హారం దేవేంద్రుడికి సమర్పిస్తారు. అయితే దేవేంద్రుడు గర్వంతో ఆ హారాన్ని తిరస్కరించి దానిని తన ఐరావతం మెడలో వేస్తారు. ఐరావతం సైతం ఆ పూలమాలను తన కాలితో తొక్కి వేస్తుంది. అసలే దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ ఇక తాను తీసుకువచ్చిన హారాన్ని ఇలా చేయడంతో దేవేంద్రుడి గర్వం అణచాలని తనకు శాపం పెడతారు. ఈ విధంగా దుర్వాస మహర్షి శాపం కారణంగా దేవేంద్రుడు తన ఐశ్వర్యాన్ని కోల్పోతాడు.

ఈ క్రమంలోనే దేవేంద్రుడు ఎంతో నీరసించిపోయి మహావిష్ణువు వద్దకు వెళ్లి తాను ఈ బాధల నుంచి బయటపడే మార్గం సూచించమని వేడుకుంటారు.ఈ క్రమంలోనే మహా విష్ణువు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని సాక్షాత్తు మహాలక్ష్మిగా భావించి పూజించమని చెబుతారు. ఈ విధంగా మహావిష్ణువు చెప్పిన విధంగానే ఇంద్రుడు దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజ చేయడం వల్ల తన సంపాదన మొత్తం తిరిగి వస్తుంది.అందుకే దీపావళి రోజు సంధ్య సమయంలో దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలను సిరిసంపదలను ప్రసాదిస్తారని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.