దీపావళి రోజున లక్ష్మీ పూజకు అనువైన సమయం… పాటించాల్సిన పద్ధతులు ఇవే?

హిందూ సంస్కృతిలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నరకాసురున్ని వధించిన తర్వాత ప్రపంచానికి పట్టిన పీడ వదిలిపోయిందన్న ఆనందంతో ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించి దీపావళి పండుగను జరుపుకున్నట్లు పురాణాలలో వివరించారు. ఈ దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చి ప్రజలు ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఇక ఈ పండుగ రోజున ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. దీపావళి పండుగ జరుపుకొని తేదీ శుభ ముహూర్తం గురించి తెలుసుకుందాం.

ఈ ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ 24వ తేదీ సోమవారం జరుపుకోవాలని. 24వ తేదీ సోమవారం సాయంత్రం 5.39 గంటల శుభ ముహూర్తంలో లక్ష్మీదేవి పూజ ప్రారంభించి సాయంత్రం 6.51 గంటలకు పూజ ముగించాలి. ఇక దీపావళి పండుగ రోజున ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.

• దీపావళీ పండగ జరుపుకోవటానికి ప్రధానంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీపావళి పండగకి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి ప్రతికూల శక్తిని పారద్రోలటానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
• వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి పండగకి ఇల్లు శుభ్రం చేసే సమయంలో విరిగిపోయిన అద్దాలు, వస్తువులతో పాటు మనం ఉపయోగించని వస్తువులను కూడా ఇంటినుండి బయట పడేయాలి.
• అలాగే ఇంట్లో ఉత్తర స్థానంలో కుబేరుడు కొలువై ఉంటాడు. అందువల్ల ఉత్తర భాగంలో ఈశాన్య దిశలను శుభ్రంగా ఉంచాలి. వాస్తు ప్రకారం ఇంటి ఉత్తర దిక్కులో నీటి ట్యాంక్ అక్వేరియం వంటి వస్తువులు ఉండకుండా చూసుకోవాలి.

• దీపావళి పండుగ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచి పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అలాగే ఇంటి ముందు కల్లాపి చలిపి రంగురంగుల ముగ్గులతో ఇంటి ముఖ ద్వారాలు అలంకరించాలి. అలంకార ప్రియురాలు అయినా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే ఇంటితో పాటు పూజ గదిలో కూడా ముగ్గులు వేసి పువ్వులతో అలంకరించి మట్టి దీపాలు వెలిగించాలి. ఇలా శుభ్రంగా అందంగా అలంకరించబడిన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ప్రతికూల వాతావరణాన్ని దూరం చేస్తుంది.