హంసవాహనం మీద శ్రీవారు !

In srivari brahmotsavalu sri venkateswara swamy on hamsa vehicle

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంసవాహనంలో స్వామివారు ఊరేగింపు జరిగింది. విశేషాలలోకి వెళితే…

   In srivari brahmotsavalu sri venkateswara swamy on hamsa vehicle

In srivari brahmotsavalu sri venkateswara swamy on hamsa vehicle

ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపజేస్తారు. స్వామి శేషతల్పశాయి. ఆయన కొలువున్న కొండ- శేషాద్రి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు. వెుదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని తొమ్మిదోరోజు ఉదయంపూటనే ఊరేగింపునకు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అది మొదటిరోజుకే వచ్చి చేరింది.

   In srivari brahmotsavalu sri venkateswara swamy on hamsa vehicle

In srivari brahmotsavalu sri venkateswara swamy on hamsa vehicle

గతంలో స్వామివారి ఊరేగింపునకై రెండు, మూడు, నాలుగు, ఏడోరోజులలో ఎలాంటి వాహనాలనూ వినియోగించేవారు కాదు. కానీ ఇప్పుడారోజుల్లోనూ వాహనసేవ జరుగుతోంది. అందులో భాగంగా రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని ‘వాసుకి’కి ప్రతీకగా పరిగణించటం కద్దు. రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మీగా వూరేగటం విశేషం. ఈ వాహన సేవను చూసినవారికి జ్ఞానం వస్తుందని కొంతమంది భక్తులు విశ్వసిస్తారు.