RGV: ఒకప్పుడు తెలుగు హిందీ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించి వార్తల్లో నిలిచారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం పొందిన ఎంతో మంది దర్శకులు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కూడా గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో సినిమాల ద్వారా వార్తల్లో నిలిచిన వర్మ ఇప్పుడు మాత్రం వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఈయన తరచూ సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ నిలుస్తున్నారు. గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వాన్ని పోలీసులను టార్గెట్ చేస్తూ పరోక్షంగా ఈయన పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా చేతిలో సినిమాలు లేకపోయినా ఈయన మాత్రం వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. శ్రీదేవి అంటే రాంగోపాల్ వర్మకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.సమయం వచ్చినప్పుడల్లా ఆర్జీవీ శ్రీదేవి గురించి మాట్లాడతాడు. ఎప్పుడూ బాధపడని ఆర్జీవీ శ్రీదేవి చనిపోయినప్పుడు మాత్రం బాధపడ్డాడు. అయితే తాజాగా శ్రీదేవి కుమార్తె గురించి ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం కానీ తన కుమార్తె జాన్వీ కపూర్ తో మాత్రం సినిమాలు అసలు చేయనని ఈయన తెలిపారు.
శ్రీదేవిని వేరే వాళ్ళతో పోల్చడం నాకు ఇష్టం లేదు. శ్రీదేవిని చూస్తే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఆమెలా ఆమె కూతురు జాన్వీ కపూర్ లేదు. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. నాకు శ్రీదేవి అంటే ఇష్టం జాన్వీ కాదు. నాకు జాన్వీతో అంత కాంటాక్ట్ కూడా లేదని అందుకే తనకు జాన్వీతో సినిమాలు చేసే ఆలోచన కూడా లేదని తెలిపారు. ఇలా ఈ అందాల భామ గురించి వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై జాన్వీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.