మనలో చాలామంది పొద్దు తిరుగుడు విత్తనాలను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. ఈ విత్తనాలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ ఈ, మెగ్నీషియం, సెలీనియం, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పొద్దు తిరుగుడు విత్తనాల ద్వారా లభిస్తాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి సహాయపడతాయి. ఈ విత్తనాలు మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగించడంలో తోడ్పడతాయని చెప్పవచ్చు.
ఈ విత్తనాలలో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని కాంతివంతం చేయటానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటానికి సహాయపడుతుంది. జింక్, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఈ విత్తనాలు రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. శరీరానికి శక్తిని అందించడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
కీళ్ల నొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించడంలో ఈ విత్తనాలు ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు. ఈ విత్తనాలు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంతో పాటు నిద్ర బాగా పట్టేలా చేయడంలో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అయితే ఈ విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. పొద్దు తిరుగుడు విత్తనాల్లో వున్న ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడుతుంది. ఈ విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని వ్యర్థమైన మలినాలను అడ్డుకుని కాపాడే శక్తి వీటికి వుంది. పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి కలుగుతుంది.