కోలీవుడ్ స్టార్ హీరో పైన విసుక్కున్న విజయశాంతి

శ్రీదేవి తర్వాత తెలుగు సినిమాల్లో అంతటి స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ అంటే విజయశాంతి అనే చెప్పాలి. శ్రీదేవి హిందీ సినిమాల్లో బిజీ అయిపోయాక, తర్వాత ఆ స్థానాన్ని విజయశాంతి భర్తీ చేసింది. అప్పటికే రాధ, రాధికా, భానుప్రియ, సుహాసిని లాంటి చాలా మంది తో పోటీ ఉన్నా విజయశాంతి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది.

అప్పటి సూపర్ స్టార్స్ అందరితో నటించిన విజయశాంతి, ఒకానొక టైం ఒక తమిళ్ హీరో ని అవమానించిందంట. అప్పుడప్పుడే కెరీర్ మొదలు పెట్టిన శరత్ కుమార్ ఒక సినిమాలో విజయశాంతి తో నటిచవలసి వచ్చిందంటే, కానీ ఆయనకు నటన రాకపోవడంతో విజయశాంతి తన మీద విసుకున్నారంట.

ఇంటర్వ్యూలో శరత్ కుమార్ మాట్లాడుతూ .. “నా ఫస్టు సినిమానే నేను తెలుగులో చేశాను .. ఆ సినిమా పేరు ‘సమాజంలో స్త్రీ’. ఆ సినిమాలో విజయశాంతి హీరోయిన్ .. అప్పటికే ఆమె బిజీ ఆర్టిస్ట్. ఆ సినిమాలో విజయశాంతి కాంబినేషన్లో ఒక సీన్ చేయవలసిన ఆర్టిస్ట్ రాలేదు. నిర్మాత నా స్నేహితుడే కావడంతో, నన్ను ఆ సీన్ చేయమన్నాడు.

అప్పటికి నాకు యాక్టింగ్ అలవాటు లేదు .. అందువలన ఆ సీన్ వెంటనే చేయలేకపోయాను. టేకుల మీద టేకులు తీసుకుంటున్నాను. విజయశాంతి ఆ షూటింగ్ తరువాత వెంటనే చెన్నై వెళ్లిపోవాలి. అందువలన ఆమె టెన్షన్ పడిపోయారు. కొత్త వాళ్లను తీసుకొచ్చి నా టైమ్ అంతా వేస్టు చేస్తున్నారు. మంచి ఆర్టిస్ట్ ను పెట్టొచ్చుగదా?’ అంటూ ఆమె విసుక్కున్నారు.

ఆ తరువాత కొంతకాలానికి ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విజయశాంతిగారి కాంబినేషన్లో చేయవలసి వచ్చింది. ఆల్రెడీ నేను ఆమెతో యాక్ట్ చేసినట్టుగా చెబితే, ఎప్పుడు? .. ఏ సినిమాలో? అని అడిగారు. ‘సమాజంలో స్త్రీ’ సినిమా అంటూ ఆమె విసుక్కోవడం గురించి కూడా చెప్పాను. ‘అయ్యో అవునా .. సారీ అండీ’ అంటూ ఆమె ఫీలయ్యారు” అంటూ చెప్పుకొచ్చారు శరత్ కుమార్.

ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలోను ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కొన్ని తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన శరత్ కుమార్, దుబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయస్తుడు.