సాధారణంగా ఎవరైనా దొంగతనం చేశామని చెబితే వాళ్లను చులకనగా చూడటం జరుగుతుంది. గుడిలో దొంగతనం చేస్తే పాపం తగులుతుందని చాలామంది ఫీలవుతారు. ఉత్తరాఖాండ్ లో ఉన్న ఒక ఆలయంలో దొంగతనం చేయడం ద్వారా కోరిన కోరికలను సులువుగా నెరవేర్చుకోవచ్చు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఉత్తరాఖాండ్ లోని చుడియాలా గ్రామంలో ఉన్న చూడామణిదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయి.
1805 సంవత్సరంలో లాండౌరా రాజుల కాలంలో ఈ ఆలయం ప్రారంభమైందని సమాచారం అందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఆలయంలో దేవతను దర్శించుకున్న తర్వాత దేవత పాదాల దగ్గర ఉన్న చెక్కముక్కను దొంగతనం చేయడం ద్వారా సంతాన ప్రాప్తి కలగడంతో పాటు కోరిన కోరికలు సులువుగా నెరవేరతాయట.
ఉత్తరాఖాండ్ లో నివశించే ప్రజలకు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసు. అయితే ఈ వార్తలను కొంతమంది నమ్మితే కొంతమంది మాత్రం అస్సలు నమ్మట్లేదు. మరి కొందరు మాత్రం తాము మొదట నమ్మకపోయినా ఆలయానికి వెళ్లిన తర్వాత నమ్మకం కలిగిందని చెబుతున్నారు. ఈ ప్రచారం విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆలయం మాత్రం ఒకింత విచిత్రమైన ఆలయం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ ఆలయంకు బస్సు లేదా రైలు మార్గాల ద్వారా ప్రయాణం చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ ఆలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.