స్త్రీ 2, వెల్కమ్ వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించిన నటుడు ముస్తాక్ ఖాన్ నవంబర్ 20వ తారీఖున కిడ్నాప్ కి గురయ్యాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కార్యక్రమం పేరుతో ఆహ్వానించిన దుండగులు ఆయనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఢిల్లీ మీరిట్ హైవేపై ఆయన కిడ్నాప్ అయినట్టు ముస్తాక్ వ్యాపార భాగస్వామి శివం తెలిపారు.
నిందితులు విమాన టిక్కెట్ల తో ముస్తాక్ ని ఆహ్వానించారు, అంతేకాదు అడ్వాన్స్ కూడా ఆయన అకౌంట్ కి పంపించారు అయితే ముస్తాక్ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత ఆయనని కారులో ఎక్కించుకున్న దుండగులు కారుని ఢిల్లీ శివార్లలోని బిజ్నోర్ సమీపంలోకి తీసుకువెళ్లారు. అనంతరం అక్కడ ముస్తాక్ ని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 12 గంటల పాటు చిత్రహింసలు పెట్టారు. ముస్తాక్ కుమారుడి ఎకౌంట్ నుంచి రెండు లక్షలకు పైగా సొమ్ము కూడా తీసుకున్నారు.
అయితే ముస్తాక్ కి ఉదయం ఆజాద్ వినిపించిందని దీనిని బట్టి ఆ దగ్గరలో మసీదు ఉండి ఉంటుందని ముస్తాక్ భావించి ఆ ప్రదేశం నుంచి పారిపోయారని శివం తెలిపారు. తర్వాత ముస్తాక్ స్థానికుల, పోలీసుల సాయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే జరిగిన సంఘటనకి ముస్తాక్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని ఇప్పటికే ఆయన ఫిర్యాదు చేసి ఉంటారని, తాను బిజ్నోర్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు శివం. తన దగ్గర విమానాశ్రయంలోని సిసి ఫుటేజీలు బ్యాంకు ఖాతాలు, విమానం టికెట్లు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
అంతేకాకుండా తనని నిర్బంధించిన ఇంటిని పరిసరాలని ముస్తాక్ గుర్తుపడతారని కూడా వివరించారు. కాగా ఇటీవల బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాల్ ని కూడా అరెస్టు చేయడం, 20 లక్షలు డిమాండ్ చేయడం, చివరికి ఎనిమిది లక్షలు ఇచ్చి దుండగుల చెర నుంచి బయటపడటం అందరికీ తెలిసిందే కానీ జరుగుతున్న ఘటనలపై దర్యాప్తు మమ్మురం చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు.