Robinhood: హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గత 15 ఏళ్లుగా మీరందరూ చూపిస్తున్న ప్రేమకి, సపోర్ట్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ కి, హీరో నితిన్ గారికి, డైరెక్టర్ వెంకీ, శ్రీలీల కి థాంక్యూ. రాబిన్‌హుడ్ తో తెలుగు ఇండస్ట్రీలో లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాల్లో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. నన్ను మీ ఫ్యామిలీ లాగా యాక్సెప్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ క్రెడిట్ నటీనటులకు, టెక్నికల్ టీంకి, దర్శకుడు వెంకీకి, నిర్మాతలకు దక్కుతుంది. తప్పకుండా ఈ సినిమా మ్యాసీవ్ సక్సెస్ కాబోతుంది. మీరందరూ కూడా సినిమాని కచ్చితంగా ప్రేమిస్తారు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ థాంక్యూ సో మచ్’అన్నారు
హీరో నితిన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆర్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, ఎడిటర్ కోటి, డిఓపి సాయి శ్రీరామ్ ఈ ముగ్గురు చాలా అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు. జీవీ ప్రకాష్ కుమార్ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. బీజీఎం అదిరిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడు మీరే చెప్తారు. మా సినిమాలో నటించిన అందరి ఆర్టిస్టులకి థాంక్యూ సో మచ్. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మార్చి 28న మీరు చూస్తారు. ఇది నాకు శ్రీలీలకి సెకండ్ మూవీ. ఫస్ట్ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా డెఫినెట్ గా ఆడుతుంది. మా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే పేరు వస్తుంది. ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. కేతిక తన ప్రజెన్స్ తో సర్ప్రైజ్ సాంగ్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళింది. మా నిర్మాతలు మైత్రి నవీన్ గారు, రవి గారు.. సినిమాకి వాళ్లే రియల్ హీరోస్. వాళ్ళు లేకపోతే మేము లేము. ఇండియాలో మైత్రి ఈరోజు టాప్ ప్రొడక్షన్ హౌస్. సినిమాని చాలా భారీగా తీశారు. దేవుడిచ్చిన తమ్ము వెంకీ. నామీద తనకి ఎంత ప్రేమ ఉందో ఈ సినిమాతో చూపించాడు. మార్చి 28న అది మీరు విట్నెస్ చేస్తారు. క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ భాయ్ ప్రజెన్స్ తో ఈ సినిమా మరో లెవల్ కి వెళ్ళింది. వార్నర్ క్రికెట్ లో ఎంత ఉత్సాహంగా ఉంటారో సినిమాలో కూడా అంతా ఉత్సాహంగా కనిపిస్తారు. ఇందులో అతని కామియో చిన్నదైనా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. సినిమాకి ఒక హై ఇస్తుంది. సినిమా ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది’అన్నారు.
హీరోయిన్ శ్రీల మాట్లాడుతూ అందరికీ నమస్కారం… మార్చి 28న మా సినిమా వస్తుంది. మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ నా హోం బ్యానర్ లా అయింది. నవీన్ గారికి రవి గారికి ధన్యవాదాలు. మా డైరెక్టర్ వెంకీ కుడుముల గారికి థాంక్యూ. నేను అనుకోకుండా చేసిన సినిమా అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఇది నితిన్ గారికి నాకు చాలా ఇంపార్టెంట్ మూవీ. అందరం కలిసి ప్రేమతో ఈ సినిమా చేసాం. కేతిక అందర్నీ సర్ప్రైజ్ చేసింది. డేవిడ్ వార్నర్ గారిని బ్యాటింగ్లో చూసాం కానీ నాకు షూటింగ్లో చూసే అవకాశం వచ్చింది. ఇప్పటివరకు వికెట్స్ అని వచ్చారు. ఇప్పుడు టికెట్స్ అని వస్తున్నారు.(నవ్వుతూ) మా సినిమాల్లో ఆయన పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని ఆడియన్స్ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నితిన్ అన్న నాకు ఫ్యామిలీ పర్సన్. నేను ఆయన దిల్ సినిమాకి ఫ్యాన్ ని. ఆయన అ ఆ సినిమాకి అసోసియేట్ గా పని చేశాను మేము ఇద్దరం కలిసి భీష్మ లాంటి సూపర్ హిట్ తీశాం. భీష్మ తర్వాత ఈ సినిమాని చేసాం. ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా చేసామంటే కారణం నవీన్ గారు రవి గారు. వారి సపోర్ట్ నేను మర్చిపోలేను. శ్రీలీల అంత బిజీగా ఉన్నప్పుడు కూడా నామీద నమ్మకంతో ప్రాజెక్టులోకి రావడం చాలా ఆనందంగా అనిపించింది. నీరా క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి టెక్నీషియన్స్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కేతిక శర్మ చేసిన అదిదా సర్ప్రైజ్ పాట హ్యుజ్ బజ్ వచ్చింది. ఈ సినిమాలో ఓ రోల్ వుంది. ఆ రోల్ కి ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయితే బాగుంటుందని సరదాగా డేవిడ్ వార్నర్ గారి పేరు చెప్పాను. రవి గారు సీరియస్ గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ గారిని ప్రాజెక్టులో తీసుకువచ్చారు. ఈ క్రెడిట్ రవి గారికి ఇస్తాను. రవి గారి నమ్మకం వల్లనే డేవిడ్ వార్నర్ ఈరోజు ఇక్కడి వచ్చారు. ఈ రోల్ యాక్సెప్ట్ చేసిన డేవిడ్ వార్నర్ గారికి థాంక్యూ. ఆ క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్ ఉంటుంది. మార్చి 28న డెఫినెట్ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం’అన్నారు
కేతిక శర్మ మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్ గారి తో స్టేజ్ ని షేర్ చేసుకోవడం డ్రీమ్ ట్రూ మూమెంట్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతలు రవి గారు నవీన్ గారికి థాంక్యూ సో మచ్ డైరెక్టర్ వెంకీ గారు చాలా సపోర్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. నితిన్ గారి స్క్రీన్ ప్రజెన్స్ మైండ్ బ్లోయింగ్. శ్రీలీల వెరీ బ్యూటిఫుల్ పర్స.న్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు . సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నితిన్ గారికి వెంకీ గారికి శ్రీ లీలా గారికి అందరికీ పేరుపేరునా థాంక్యూ. మా డేవిడ్ వార్నర్ గారికి స్పెషల్ థాంక్యూ. మార్చి 28న సినిమా వస్తుంది. అందరూ థియేటర్లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను . కేతిక గారికి థాంక్యూ. ఈ సినిమాలో నవ్వులతో పాటు కథ ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది.మార్చి 28న మీ అందరిని బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేస్తాం. ఎవరు మిస్ అవ్వొద్దు. అందరూ చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం ట్రైలర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసి డైరెక్టర్ వెంకీతో సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాను. హీరో నితిన్ గారికి డైరెక్టర్ వెంకీ గారికి థాంక్యూ సో మచ్. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి ఎంటర్టైనర్. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారు’అన్నారు
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్స్ నా సొంత కంపెనీ లాంటిది. వారి బ్యానర్ లో శ్రీమంతుడు వాల్తేరు వీరయ్య సినిమాలు చేశాను. రాబిన్ హుడ్ సినిమా ఈ సమ్మర్ లో ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేసే మంచి ఎంటర్టైనర్. డైరెక్టర్ వెంకీ కుడుముల చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమాతో నితిన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ వెన్నెల కిషోర్ ట్రాక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాని చాలా ప్రేమతో చేశాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను హీరోగా చేస్తున్న రోజులు గుర్తుకొచ్చాయి. మంచి కథ కామెడీ ఉన్న సినిమా ఇది. తప్పకుండా మీ అందరిని గొప్పగా అలరిస్తుంది. మైత్రీ మూవీ లిస్టు లో అతి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ..డైరెక్టర్ వెంకీ కుడుముల పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్. తను రెండు సూపర్ హిట్ లు తీసాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. వెంకీ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. తనది బాక్సాఫీస్ ఉడుము పట్టు. నితిన్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన కం బ్యాక్ లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. రాబిన్ వుడ్ నితిన్ గారి కెరియర్లో నెంబర్ వన్ సినిమాగా నిలబడబోతుంది. ట్రైలర్ చాలా హై ఇచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలో నెంబర్ వన్ బ్యానర్. చాలా ప్యాషన్ తో సినిమాలు తీస్తారు. సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. సినిమా అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను’అన్నారు
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. మా టీం తర్వాత నా ఫస్ట్ ఆడియన్ వెంకీ. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. నితిన్ గారు, వెంకీ కాంబినేషన్లో భీష్మ బిగ్గెస్ట్ హిట్. ఆ సినిమా కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. డేవిడ్ వార్నర్ ఆటకి పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈ వేడుకలో వుండటం చాలా ఆనందంగా ఉంది. మంత్రి మూవీ మేకర్స్ నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. వారి బ్యానర్ లో అంటే సుందరానికి సినిమా చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమాతో వారికి మరో సూపర్ హిట్ రావాలని కోరుకుంటున్నాను’అన్నారు
డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ… వెంకీ తన సినిమాని చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. తెలుగు సినిమా స్ట్రెంత్ ఎంటర్టైన్మెంట్ వెంకీ అలాంటి ఎంటర్టైన్మెంట్ తీసే దర్శకుడు. తను ఆల్రెడీ రెండు సినిమాలతో ప్రూవ్ చేశాడు. నితిన్ వెంకి కాంబినేషన్లో ఈ సినిమా మరో సూపర్ సక్సెస్ అవుతుందని, ఈ సినిమా థియేటర్స్ అదరగొట్టేస్తుందని నమ్ముతున్నాను’అన్నారు
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ. ఎంటర్టైన్మెంట్ రాసేవాళ్ళు తీసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఆలాంటి కొద్దిమంది దర్శకుల్లో వెంకీ కుడుముల ఒకరు. నితిన్ గారికి పెద్ద ఫ్యాని. ఇష్క్ సినిమా ఎన్నోసార్లు చూస్తుంటాను. ట్రైలర్ లో డబ్బులు విపరీతంగా కనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కి కలెక్షన్లు కూడా కుంభ ముష్టి కురవాలని కోరుకుంటున్నాను’అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. ఇది స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్. వెంకీ కుడుముల గత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కాబోతుంది. హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ ఉండే రాకింగ్ ఫిల్మ్ ఇది. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు’అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.