మీ పిల్లలు మట్టి, సుద్ద తింటున్నారా.. ఈ సమస్యలకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

మనలో చాలామంది పిల్లల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. అయితే పిల్లల ఆహారపు అలవాట్లు కొన్నిసార్లు చిరాకు తెప్పించే విధంగా ఉంటాయి. తల్లీదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలనే సంగతి తెలిసిందే. పిల్లలు వయస్సుకు తగిన విధంగా ఎదగకపోతే తల్లీదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు మట్టి, సుద్ద పేపర్లు తింటే తల్లీదండ్రులు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

ఏమైనా ఆరోగ్య సమస్యలతో పిల్లలు బాధ పడుతున్నారో అని పరీక్షలు చేయించి తెలుసుకోవాలి. పిల్లలకు పోషకాహార లోపం ఉంటే తినకూడని వాటిని సైతం తినాలనే ఆసక్తి కలుగుతుంది. సుద్ద, బలపం, సున్నం పిల్లలు ఎక్కువగా తీసుకుంటే రక్త హీనత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వైద్యుల సలహాల ప్రకారం పిల్లలకు ఆహారం అందిస్తే ఈ సమస్యను అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది.

పిల్లలకు బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం ద్వారా కాల్షియం లోపం ఉంటే ఆ లోపంను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లల్లో అభద్రత తొలగిపోయే విధంగా పిల్లలతో మరింత సన్నిహితంగా మెలిగితే మంచిది. పిల్లల విషయంలో ప్రేమగా వ్యవహరిస్తే ఎంతో మంచిదని చెప్పవచ్చు. పిల్లలు సరైన మందులు వాడితే సమస్యలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి.

కొంతమంది పిల్లలకు మానసిక చికిత్స కూడా అవసరం అనే అవసరం ఉంటుంది. పిల్లల సమస్య ఆధారంగా వైద్యులు చికిత్స అందించడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉండదు.