మనలో చాలామంది ముఖం తెల్లగా, అందంగా కనిపించాలని భావిస్తారు. ముఖం మెరిసిపోవడానికి, ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రపరచడం, టోన్ చేయడం, మాయిశ్చరైజ్ చేయడం, సూర్యరశ్మి నుండి రక్షించుకోవడం, తగినంత నీరు త్రాగడం, మరియు సహజ పదార్థాలతో ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం వంటి చిట్కాలు పాటిస్తే మంచిది. రోజూ ఉదయం, రాత్రి ముఖాన్ని మృదువైన ఫేస్ వాష్ తో కడిగి, రోజ్ వాటర్ తో టోన్ చేసి, మాయిశ్చరైజర్ రాయడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
బయటకు వెళ్ళే ముందు కనీసం 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ ఉండటం ద్వారా మెరుగైన ఫలితాలు పొందే ఛాన్స్ ఉంటుంది. రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. శనగపిండి, పెరుగు కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం మెరుపు పెరుగుతుందని చెప్పవచ్చు. అర కప్పు కీరా గుజ్జులో కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాల్సి ఉంటుంది.
బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మేలు జరుగుతుంది. వేప పొడి, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుందని చెప్పవచ్చు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మంచి నిద్ర ముఖానికి కాంతిని అందిస్తుందని చెప్పవచ్చు. ఆందోళన లేని జీవితం గడపడం వల్ల ముఖం మెరిసే అవకాశాలుంటాయి.
బీట్ రూట్ ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం మెరుస్తుందని చెప్పవచ్చు. బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు జరుగుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడంలో బీట్ రూట్ ఉపయోగపడుతుంది. బీట్ రూట్ తీసుకోవడం ద్వారా మెరిసే చర్మాన్ని సులువుగా పొందవచ్చు. వారానికి మూడు నుంచి నాలుగుసార్లు ఈ విధంగా అప్లై చేస్తే మేలు జరుగుతుంది.