వాస్తు నియమాలకు విరుద్ధంగా ఇంట్లో ఈ దిక్కున చెత్త డబ్బా పెడితే సమస్యలు తప్పవు..?

మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్త ఇంటిని నిర్మించుకునే దగ్గరినుండి ఇంట్లో వస్తువులు అమర్చుకునే వరకు వాస్తు నియమాలను పాటిస్తూ అన్ని వస్తువులు అమర్చుకోవటం చాలా మంచిది. అలాకాకుండా వాసు నియమాలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించుకోవడం లేదా ఇంట్లో వస్తువుల అమర్చుకోవటం వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా వాస్తవ నియమాలకు అనుగుణంగా ఉంచుకోవడం మంచిది. అదేవిధంగా మనం ఇంట్లో ఉంచుకొని చెత్త డబ్బా కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉంచుకోవాలి లేదంటే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం చెత్త డబ్బా ను ఏ దిక్కులో ఉంచటం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

• వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనిని అగ్ని కోణం అని పిలుస్తారు. అందువల్ల ఆగ్నేయ దిక్కున చెత్త వేస్తే ఖర్చులు పెరుగుతాయి.
• ఇంటి ఈశాన్య దిక్కున కుబేరుడు , శివుడు కొలువై ఉంటారు. అందువల్ల ఈశాన్య దిశలో డస్ట్ బిన్ ఉంచటం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టవచ్చు.
• వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ దిక్కు యమరాజుది. ఈ దిక్కున చెత్త డబ్బా ఉంచితే పేదరికాన్ని పెంచుతుంది.
• తూర్పు దిక్కుకు సూర్యుడికి ప్రసిద్ధి. ఇంట్లో ఈ దిక్కున కూడా డస్ట్ బిన్ ఉంచటం వల్ల మనం చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.
• వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి, వాయువ్య దిశలు చెత్త డబ్బా ఉంచటానికి అనుకూలం. ఈ దిశలలో చెత్త డబ్బా ఉంచటం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవవు.