భీమేశ్వర ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ ఆలయ విశిష్టతలు ఏమిటో తెలుసా..?

సాధారణంగా దేశంలో ఉన్న ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే భీమేశ్వర ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. దట్టమైన అడవిలో, ప్రకృతి ఒడిలో భీముడు ప్రతిష్టించిన ఆలయంగా భీమేశ్వర ఆలయం గుర్తింపు పొందింది. ఈ సంతాయిపేట భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. భీముడు ప్రతిష్టించిన ఆలయంగా చెప్పబడుతున్న ఈ ఆలయాన్ని భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచినది.

ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అడవి మధ్యలో వాగుని దాటి వెళ్ళవలసి ఉంటుంది. అందువలన దర్శనానికి మునుపే సహజంగానే కాళ్లు శుభ్రం అవుతాయి. ఈ ఆలయంలో శివుడు పంచముఖిడిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో పండితులు శివుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులే శివుడికి స్వయంగా నీటితో అభిషేకం చేస్తారు.

ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే 12వ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ దేవాలయానికి ఉత్తర ముఖ ద్వారం ఉంటుంది. అలాగే పడమర ముఖ ద్వారం కూడా ఉండటం ఒక విశేషం. దేశంలో ఎక్కడా లేనివిధంగా భీమేశ్వరాలయంలో కుంతీదేవి ఆలయం కూడా ఉంది. సంతానం లేనివారు కుంతీదేవి దర్శనం ద్వారా సంతానం కలుగుతుంది అని ఇక్కడి ప్రజల నమ్మకం. శివరాత్రి పర్వదినాన ఈ ఆలయంలో భక్తులందరూ విశిష్ట పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. భీమేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లగానే ముందుగా పెద్ద మహానంది దర్శనమిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక అర ఇంచు పెరుగుతుంది అని ఇక్కడ భక్తులు చెబుతుంటారు.

ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుకు పారే వాగు మధ్యలో భీమేశ్వర స్వామి ఆలయం నిర్మించబడి ఉంది. అందుకే ఈ వాగును దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఈ వాగులో మాగస్నానాలు, కార్తీక స్నానాలు, శ్రావణాలు చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు.