గడియారం వాస్తు గురించి మీకు తెలుసా.. ఇంట్లో గడియారం ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇన్ని సమస్యలా?

మన జీవితంలో టైమ్ కు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మన టైమ్ బాగుంటే మాత్రమే మనం చేపట్టిన పనుల్లో కూడా సులభంగా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే ఇంట్లో గడియారానికి కూడా వాస్తు ఉంటుందని గడియారంను ఇంట్లో పెట్టే ప్రదేశం విషయంలో తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో గడియారం ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

గడియారంను దక్షిణ గోడపై లేదా టేబుల్‌పై ఉంచడం మంచిది కాదు. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంతమంది పని చేయని, పాడైపోయిన గడియారాలను ఇంట్లో అలానే ఉంచుతారు. ఈ విధంగా చేయడం వల్ల వాస్తు దోషాలు కలిగే అవకాశాలు ఉంటాయి. నలుపు, నీలం రంగు గడియారాలను ఇంట్లో ఉంచడం మంచిది కాదు.

ఇలాంటి గడియారాలను ఇంట్లో ఉంచడం వల్ల మనపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుంది. తూర్పు లేదా ఉత్తరం దిశలో గడియారంను పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. గుండ్రంగా లేదా చతురస్రాకారంగా ఉన్న గడియారాలను ఇంట్లో ఉంచితే మంచిది. లోలకం ఉన్న గడియారం పవిత్రమైన గడియారమని ఇలాంటి గడియారం ఉంటే శుభం కలుగుతుందని పండితులు వెల్లడిస్తున్నారు.

కోణాల ఆకారంతో ఉన్న గడియారాన్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. ఎవరైతే వాస్తు నియమాలను పాటిస్తారో వాళ్ల కుటుంబాలకు మేలు జరుగుతుంది. వాస్తు ప్రకారం గడియారాన్ని ఉంచని వాళ్లు ఇకనైనా ఈ వాస్తు నియమాలను పాటిస్తే మంచిది. గడియారాన్ని ఎక్కడ ఉంచాలనే ప్రశ్నకు సంబంధించి సందేహాలు ఉంటే వాస్తు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.