ఇంటికి సంబంధించిన వాస్తు దోషాల గురించి ఆ దోషాల వల్ల వచ్చే కష్టాల గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఆర్థిక సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్తగా ఇంటిని నిర్మించే వాళ్లు ఇంటికి సంబంధించిన ప్రతి గది విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రధానంగా వంటగది వాస్తు విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి.
వంటగది విషయంలో సరైన వాస్తు నియమాలను పాటిస్తే ఆరోగ్యం, విజయం, శ్రేయస్సు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంట్లో వంటగది ఆగ్నేయ భాగంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఎవరైతే ఆగ్నేయ భాగంలో వంటగదిని ఏర్పాటు చేసుకుంటారో వారి ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. స్థలం తక్కువగా ఉన్నవాళ్లు వాయువ్య దిశలో వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగదిలో లేత రంగు పెయింట్ వేసుకుంటే మంచిది.
ఆహార పదార్థాలను వాయువ్య దిశలో ఉంచడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఆహారం వండే సమయంలో బయటి వ్యక్తులకు కనిపించకుండా పరదాలతో కప్పి ఉంచాలి. వంటగదిలో పూజగదిని ఏర్పాటు చేసుకోవడం, వాషింగ్ మెషీన్ పెట్టడం, చీపురు ఉంచడం చేయకూడదు. ఈ పనులు చేస్తే చెడు ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
కొంతమంది వంటగది విషయంలో చేసే తప్పుల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే వంటగది విషయంలో ఈ తప్పులు చేసిన వాళ్లు ఆ తప్పులను సరిదిద్దుకునే విధంగా అడుగులు వేస్తే మంచిది. ఇంటి వాస్తు విషయంలో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.