మహాశివరాత్రి కి ముందు కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతం తెలుసా…?

shiva

ప్రజలకు భగవంతుడి పట్ల చాలా నమ్మకం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఇలా వారి ఇష్ట దైవానికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఆ దేవుడి అనుగ్రహం పొందుతూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసం మాఘ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తిశ్రద్ధలతో శివుని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మాఘమాసంలో మన కలల ద్వారా మన భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి సంకేతాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని శుభ సూచికంగా కూడా చెబుతారు. శివరాత్రి సందర్భంగా శివుడు కలలో కొన్ని సూచనలు ఇస్తాడు అని పండితుల నమ్మకం.

హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసం శుక్లపక్షం 14వ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రిని ఫిబ్రవరి 18 శనివారం నాడు జరుపుకోనున్నారు. శివరాత్రి నాడు జాగరణ, ధ్యానం, శివుడి ఆరాధన, ఉపవాసం చేయడం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రికి ముందు మీకు వచ్చే కలల వలన మీకు శివుడు అనుగ్రహం ఉంది అని తెలియజేస్తాయి.

ఈ మాఘ మాసంలో శివరాత్రి కి ముందు మీకు కలలో నల్లని శివలింగం దర్శనం కలిగితే మీరు త్వరలో మీ పనిలో ప్రమోషన్ పొంది మంచి విజయం కలుగుతుంది అని అర్థం. అలాగే శివుడి చేతిలో ఎప్పుడు త్రిశూలం ఉంటుంది. మహాశివరాత్రికి ముందు త్రిశూలం వెనక మీకు కలలో కనిపించినట్లయితే త్వరలో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.

మహాశివరాత్రి పర్వదినానికి ముందు మీ కలలో పాముల పుట్ట లేదా పాము కనిపించినట్లయితే అది మీ సంపద శ్రేయస్సు కు ప్రతిగా పరిగణిస్తారు.కలలో శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కల వస్తే అది మీకు ఎంతో శుభసూచకం. శివుడు వారిపట్ల ప్రసన్నుడై ఉండి త్వరలో వారి కష్టాలన్నీ తీరుస్తాడని అర్థం. అలాగే
పురాణాల ప్రకారం మహా శివుడు డమరుకాన్ని 14 సార్లు వాయించిన తర్వాత సృష్టిలో లయలు, రాగాలు పుట్టుకొచ్చాయి. కలలో డమరుకం రావడం జీవిత స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ కల మీ ఇంట్లో జరగబోయే శుభకార్యాన్ని సూచిస్తుంది.